జగన్‌కు ఏపీ ఉద్యోగుల షాక్ ఇచ్చారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలి. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ కోరారు. గురువారం సంఘం ప్రతినిధులు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు.
ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్ భవన్ వద్ద సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ, ‘ఉద్యోగులకు జీతభత్యాలు, డిఎ, పి ఆర్ సి బకాయిలు, పిఎఫ్ క్లెయిమ్ లు, మెడికల్ క్లెయిమ్ లు సకాలంలో ఇవ్వకపోవడంపై గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేయడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగ పెన్షనర్ల చరిత్రలో ఇదో నూతన అధ్యాయానికి తెరదీసిన రోజుగా భావిస్తున్నామని’ పేర్కొన్నారు.