ఢిల్లీలో జగన్ కు షాక్, మండలి రద్దుకు నో చెప్పేసిన కేంద్రం…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో మండలి రద్దు బిల్లుని చర్చించడానికి నో చెప్పింది కేంద్రం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లును పేర్కొనలేదు. దీంతో ఆ బిల్లు ఇప్పట్లో పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనితో రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది.

వాస్తవానికి మండలి రద్దు బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు వస్తుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా అసలు ఈ బిల్లు ఏ మాత్రం ప్రస్తావన లేకపోవడంతో వైసీపీ ఎంపీలు కూడా షాక్ అయ్యారు. మండలి రద్దు విషయంలో అందరూ కేంద్రం మద్దతు ఉందని భావించారు. అటు వైసీపీ నేతలు కూడా కేంద్రం తమకు అనుకూలంగా ఉంది ఈ సమావేశాల్లో చర్చించడం ఖాయమని భావించింది.

అయితే అది సాధ్యం కాలేదు. విజయసాయి రెడ్డి దీనిపై ప్రయత్నాలు చేసినా కేంద్రం అంగీకరించలేదని… అదే జరిగితే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని కేంద్రం భావించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో కూడా బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అందుకే కేంద్రం లైట్ తీసుకుందని చర్చకు తీసుకురాలేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news