తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ తగులనుంది. త్వరలోనే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. దీనిపై ఇవాళ విద్యుత్ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ లో టీఎస్ ఎస్పిడి సిఎల్ సిఎండి రఘుమా రెడ్డి మీడియా తో మాట్లాడారు. గృహ అవసరాలకు కూడా కరెంటు చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని.. సహృదయముతో అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.
చార్జీల పెంపు ప్రతి పాదనలు ఇచ్చే ముందు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసామని వెల్లడించారు. గృహ అవసరాలకు యూనిట్ కు 50 పైసలు, వాణిజ్య వినియోగదారులపై యూనిట్ కి ఒక్క రూపాయి పెంచాలని ప్రతిపాదనలు ఇచ్చామని వివరించారు. గత ఐదేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదని.. తప్పని పరిస్థితుల్లో చార్జీల పెంపు ప్రతిపాదించామని వెల్లడించారు. మా ప్రతిపాదనలకు ఈఆర్సి ఆమోదించాల్సిందిగా కోరుతున్నామని సిఎండి రఘుమా రెడ్డి తెలిపారు. ఈ లెక్కన తెలంగాణ త్వరలోనే కరెంటు ఛార్జీలు పెరుగనున్నాయన్న మాట.