షాకింగ్ ప్రయోగం.. జపాన్ శాస్త్రవేత్తలు ఏం చేశారో తెలుసా?

-

మీకు అందరికీ రోబోల గురించి తెలిసే ఉంటుంది. మొత్తం మెటల్ బాడీతో పని చేసే యంత్రం. ఈ రోబోలు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాయి. అయితే మీకు సైబోర్గ్ గురించి తెలుసా?. ఇది సగం జీవం, సగం రోబో కలగలిపిన టెక్నాలజీ. దీన్నే సైబోర్గ్ అంటారు. టెక్నాలజీకి మారుపేరైన జపాన్ శాస్త్రవేత్తలు మనుషులపై నేరుగా ప్రయోగాలు చేయకుండా..కీటకాలపై ప్రయోగాలు చేస్తున్నారు. భూకంపాల వంటి విపత్తలో సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌కు సహాయపడేందుకు బొద్దింకలు, తేనేటీగలపై ప్రయోగాలు చేస్తున్నారు.

జపాన్-బొద్దింక
జపాన్-బొద్దింక

ప్రయోగంలో భాగంగా మడగాస్కర్‌కు చెందిన బొద్దింక వీపుపై సోలార్‌తో పని చేసే రిమోట్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. బొద్దింక దిశను సూచిస్తూ విద్యుత్ ప్రేరకాలను పంపుతాయి. తద్వారా వాటిని లక్ష్యం వైపు నడిపించాలన్నది శాస్త్రవేత్తల ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ప్రయోగం విజయవంతమైంది. బొద్దింక ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అణుధార్మికతను కూడా తట్టుకునే సామర్థ్యాన్ని వీటికి ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news