మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్..

-

మాంస ప్రియులకు షాకింగ్ వార్త చెప్పారు ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. పచ్చి మాంసం లో పరాన్న జీవి అయిన టోక్సొప్లాస్మాగోండి ఉంటుందని వారు కనుగొన్నారు. ఈ పరాన్నజీవి కారణంగా రెటీనా పై మచ్చలు వచ్చే అవకాశం ఉందని, చూపు కూడా తగ్గుతుందని గుర్తించారు. ఈ పరిస్థితి ప్రతీ 150మంది ఆస్ట్రేలియన్ల లో ఒకరికి వస్తున్నట్లు గుర్తించారు.

పరిశోధనలో భాగంగా ఐదు వేల మంది రెటీనా చిత్రాలను విశ్లేషించారు. ఆ చిత్రాల ఆధారంగా టోక్సోప్లాస్మాసిస్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అయితే మాంసాన్ని పూర్తిగా మానేయమని మాత్రం పరిశోధకులు సిఫారసు చేయడం లేదు. కొన్ని సూచనలు మాత్రమే ఇస్తున్నారు. తాజా మాంసాన్ని మాత్రమే షాపు నుంచి తెచ్చుకోవాలి. ఆరుబయట గంటలకొద్దీ నిల్వ ఉంచిన మాంసాన్ని తెచ్చుకోకూడదు. పసుపు, ఉప్పు వంటి వాటితో మాంసాన్ని శుభ్రం చేయాలి. చాలా సేపు ఉడికిన తర్వాత తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news