ఇది విద్యార్థుల పాలిట పిడుగుపాటు : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) విద్యార్థుల బస్సు పాసుల ధరలు మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బస్ పాస్ ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం విద్యార్థుల పాలిట పిడుగుపాటు అని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాల నడ్డి విరిచేలా ఉందని, మోయలేని భారంతో విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ఉందని విమర్శించారు. ఈ అన్యాయపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Revanth Reddy seeks NRIs' support for Congress party

అంతేకాకుండా కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ… ఛార్జీలను పెంచాలని ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను ఈ రీతిలో భారీగా పెంచడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ఆర్టీసీ వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు కోమటిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news