ఆర్టికల్ 370 రద్దు కోపమా లేక మరొకటా తెలియదు గాని కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు బిజెపి నేతలను టార్గెట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాశ్మీర్ లోయలో ఇప్పటి వరకు ఇద్దరు బిజెపి నేతలను ఉగ్రవాదులు కాల్చి చంపగా మరికొందరు నేతలు గాయపడ్డారు. దీనితో ఇప్పుడు వారికి రక్షణ కల్పించాలి అనే డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. వారికి కేంద్ర రక్షణ అవసరం అంటున్నారు.
అటు బిజెపి నేతలకు స్థానిక పోలీసులు రక్షణ కల్పించినా సరే వారి ప్రాణాలను కాపాడటం మాత్రం ఇప్పుడు పెద్ద సవాల్ గానే ఉంది అనే చెప్పాలి. కీలక ఉగ్రవాద నాయకులను గత కొన్ని రోజులుగా ఆర్మీ కాల్చి చంపుతుంది. ఈ తరుణంలోనే వారు బిజెపి నేతలను టార్గెట్ చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆరు నెలల్లో దాదాపు 250 మంది ఉగ్రవాధులను ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో కాల్చి చంపారు.