బీహార్ లో కల్తీ మద్యం సేవించి 72 మంది చనిపోయిన ఘటనలో షాకింగ్ విషయాలు వెళ్లడయ్యాయి. నిందితులు హోమియోపతి మందులను ఉపయోగించి విషపూరిత లిక్కర్ ని తయారు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులు గత కొద్ది కాలంగా కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. వీళ్లంతా యూపీ కి వెళ్లి 90% ఆల్కహాల్ ఉన్న హోమియోపతి మందులను కొనుగోలు చేసి.. వాటిని మద్యం తయారీకి ఉపయోగించినట్లు సీట్ విచారణలో తేలింది.
ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి సహా మొత్తం ఐదుగురిని సీట్ పోలీసు బృందం శుక్రవారం అరెస్టు చేసింది. ఈ కల్తీ మధ్య అన్ని తాగి ఆ నిద్దుతలలోనే ఒకరు తీవ్ర స్వస్థతకు గురయ్యారని పోలీసులు వివరించారు. కల్తీ మద్యం సరఫరా కేసులో రాజేష్ అనే నిందితుడు గతంలోనే జైలుకు వెళ్లినట్లు చెప్పారు.