ఇండియా vs న్యూజీలాండ్: డెబ్యూ మ్యాచ్ లోనే సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్..

న్యూజీలాండ్ తో కాన్పూర్ లో జరుగుతున్న మొదటి టెస్టులో ఇండియా బ్యాటర్లు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తొలి సారి టెస్ట్ ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ తన మొదటి మ్యాచ్ లోనే సెంచరీతో చెలరేగాడు. మొదటి రోజు 75(136) పరుగులతో రెండో రోజు తన ఆటను ప్రారంభించిన శ్రేయాస్ అయ్యర్, న్యూజిలాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి తన సెంచరీని పూర్త చేశాడు. 157 బంతుల్లో తన డెబ్యూ సెంచరీని సాధించాడు. ఇందులో 12 ఫోర్లు, 2 సిక్సులు కూడా ఉన్నాయి.

ఇప్పటికి ఇలా డెబ్యూలోనే సెంచరీ సాధించిన 16 వ ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ రికార్డల్లోకి ఎక్కారు.  అయితే కివీస్ పై ఇలా తొలిమ్యాచ్ లోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు ముగ్గరు ఉన్నారు. తొలిరోజు రెండో సెషన్ లో కివీస్ బౌలర్లు భారత బ్యాటర్లను కట్టడి చేశారు. వికేట్లు పడుతున్న తరుణంలో వచ్చిన అయ్యర్, జడేజాతో కలిసి 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతం భారత స్కోర్ 7 వికేట్ల నష్టానికి 300 పరుగులను దాటింది. సెంచరీ చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వెనుదిరిగాడు.. ఈ క్రమంలో ప్రస్తుతం అక్షర్ పటేల్, అశ్విన్ లు బ్యాటింగ్ చేస్తున్నారు.