ఇండస్ట్రీలో అంతగా గుర్తింపు రాలేదు..శంతనుతో డేటింగ్ నిజమేనన్న శ్రుతిహాసన్!

-

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టెలెంటెడ్ హీరోయిన్ అనగానే గుర్తొచ్చే హీరోయిన్స్‌లో శ్రుతిహాసన్ పేరుంటుంది. రోజూ సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ హైలైట్ అవుతుంటుంది ఈ భామ. లోకనాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ సుందరి..సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.

తెలుగులో ఈ భామ నటించిన చిత్రాలు చక్కటి విజయాలు సాధించాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్ ’ ఫిల్మ్‌లో హీరోయిన్ గా నటించిన శ్రుతి హాసన్..ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. ఈ భామ తాజా ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో గుర్తింపు, బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

ఈ ఏడాది తన కెరీర్ సాఫీగా సాగిందని, ప్రేక్షకుల ఆదరణ పొందగలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. స్టార్ హీరోలు అయిన ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్నానని చెప్పింది. ‘‘సలార్’’, ‘‘వాల్తేరు వీరయ్య’’, ‘‘NBK 107’’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. ఇంకా పలు ఫిల్మ్స్ చర్చల దశలో ఉన్నాయని పేర్కొంది.

ఇక తనకు ఆర్థిక రాజధాని ముంబై సొంత నగరమని, అమ్మతో కలిసి హిందీ మాట్లాడుతూ తాను ఇక్కడ పెరిగానని చెప్పింది శ్రుతి. 2009లో తాను ‘‘లక్’’ అనే ఫిల్మ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పిక్చర్స్ చేశానని, కానీ, అంతగా గుర్తింపు రాలేదని వివరించింది. ఇక శంతను హజారికతో డేటింగ్ గురించి స్పందించింది. తన జీవితంలో చాలా మంది యాక్టర్స్ తే డేటింగ్ చేశానని, కానీ, వాళ్లతో వర్కవుట్ కాలేదని చెప్పకనే చెప్పేసింది.

తనకు శంతను హజారికకు మధ్య కామన్ ఫ్రెండ్స్ అన్నారని, అలా ఇద్దరి మధ్య పరిచయం బలపడి డేటింగ్ వరకు వచ్చిందని చెప్పిన శ్రుతి హాసన్..శంతను అరుదైన వ్యక్తి అని కితాబిచ్చింది. శంతనుతో డేటింగ్ బాగుంటుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news