Shyam Singha Roy: ‘శ్యామ్ సింగరాయ్’ తో ర‌చ్చ చేయ‌నున్న నాని.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

-

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని య‌మా స్పీడ్లో ఉన్నారు. ఏ పెద్ద హీరో కూడా చేయ‌ని సాహసం చేశారు. లాక్ డౌన్ ను ఏ మాత్రం లెక్క‌చేయ‌కుండా .. వరుస సినిమాలను లైన్‌లో పెట్టి షూటింగ్ చేస్తున్నాడు. రీసెంట్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే చిత్రంలో హీరోగా న‌టించారు. అయితే.. ఈ సినిమాను థియేటర్స్‌‌‌లో కాకుండా ఓటీటీ వేదికగా విడుదల చేశారు. నాని సరసన తెలుగమ్మాయి రీతువర్మ నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

అయినా ఏ మాత్రం నిరాశ చెంద‌కుండా..ఇక ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. టాక్సీవాల ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్ తోపాటు కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఆ చిత్రం నుంచి విడుద‌లైన ఫస్ట్ లుక్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా మీద మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. దీంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది. రైజ్ ఆఫ్ శ్యామ్ అంటూ విడుదల చేయనున్న ఈ లిరికల్ వీడియో ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. నవంబర్ 6న ఈ ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో కుర్చీలో కూర్చుని.. చేతిలో సిగరెట్ పట్టుకుని, అలా సీరియస్ లుక్కుతో నాని కనిపిస్తున్నారు.

మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇతర ప్రధాన పాత్రలను రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు పోషిస్తున్నారు. భారీ స్థాయి వీఎఫెఎక్స్‌తో ‘శ్యామ్ సింగరాయ్’ క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version