షాకింగ్ : భారీ పేలుడు.. 91మంది మృతి !

-

ఆఫ్రికా కంట్రీ లోని సియర్రా లియోన్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లియోన్ రాజధాని ఫ్రీటౌన్ లో గోత్రం సూపర్ మార్కెట్ సమీపంలో… చమురు ట్యాంకర్ ఓల్డ్ లారీని ఢీ కొట్టి రోడ్డుపై నిలిచిపోయింది. హూ ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీక్ అవుతుండగా… ప్రజలు దాన్ని తీసుకునేందుకు ఎగబడి పోయారు. జనం బాగా గుమిగూడిన నేపథ్యంలోనే… టాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది.

అయితే ఈ ప్రమాద ఘటన లో 91 మంది మృ తి చెందారు. అలాగే సుమారు 100 మంది ప్రజలు క్షతగాత్రులు అయ్యారు. పేలుడు ధాటికి సమీపంలోని షాపులు మరియు పాదచారులకు కూడా మంటలు అంటుకున్నాయి. మృతులను గుర్తుపట్టలేని విధంగా కాలి పోయారు. వారి శరీర భాగాలు విసిరి వేసినట్టుగా చెల్లా చెదురుగా పడ్డాయి. ప్రస్తుతం ఘటన జరిగిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద ఘటన గురించి తెలిసిన… సియర్రా లియోన్ అధ్యక్షుడు జూలియన్ మాడ బియో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news