కబ్బన్‌పేట్‌లోని సిటీ స్ట్రీట్‌లోని వీకేఎస్ సిల్వర్ షాప్ ఉద్యోగులు హరీష్, మున్నాపై ఆరోపణలు రావడంతో షాపు యజమాని గోవిందరాజనగర్‌కు చెందిన కైలాశ్‌చంద్ గాంధీ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. హరీష్, మున్నా కబ్బన్ పేట్‌లోని సిటీ స్ట్రీట్‌లోని వీకేఎస్ సిల్వర్ షాప్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల వెండి సంబంధించిన ఆభరణాల్లో తేడా రావడంతో దుకాణంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నిందితులు వెండి ఆభరణాలను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు.
పత్రాలను పరిశీలించగా ఇప్పటివరకు రూ.1.65 కోట్ల విలువైన 300 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తాము పనిచేస్తున్న వెండి దుకాణంలో ఇద్దరు ఉద్యోగులు 3 క్వింటాళ్ల వెండిని అపహరించినట్లు హలాసుర్గేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.