స్టొరీ నచ్చినా కమల్​హాసన్ మూవీకి నో చెప్పిన ప్రొడ్యూసర్స్​… ఎందుకో తెలిస్తే షాక్!

-

ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి చిత్రపరిశ్రమలో గొప్ప పేరును సొంతం చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. దర్శకుడిగానే కాకుండా నిర్మాత, రచయిత, నటుడిగానూ ఆయన దక్షిణాది వారికి సుపరిచితులు. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విశేషాలు బయటపెట్టారు.

“శారీరకంగా నా వయసు 92.. మానసికంగా 25” అంటూ సంగీతం నవ్వులు పూయించారు. ‘మాయబజార్‌’కు కో డైరెక్టర్‌గా పనిచేశారా? అసోసియేట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారా? అని ప్రశ్నించగా.. ‘అసిస్టెంట్‌గా అప్పుడే నా ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు. ఎన్టీఆర్‌ని కృష్ణుడిగా చూడటం ఒక అద్భుతమని అన్నారు. అనంతరం కమల్​హాసన్​ ‘పుష్పక విమానం’ సినిమా గురించి మాట్లాడుతూ.. “కథ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకున్నారు. కానీ, ఆ చిత్రాన్ని నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే బాగుండు అనుకున్నా” అని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news