సిట్టింగ్ వర్సెస్ మాజీ: ఆ సీటు పోయినట్లే!

-

అధికార టీఆర్ఎస్‌లో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.  చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలకు ఒకరంటే ఒకరికి పడని పరిస్తితి…ఎవరికి వారే ఆధిపత్యం చెలాయించాలని చెప్పి…సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని చెప్పి తీవ్రంగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న చోట వర్గ పోరు తీవ్ర స్థాయిలో నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు మధ్య పోరు ఎక్కువగా ఉంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చిన 12 స్థానాల్లో ఇదే పరిస్తితి ఉంది…అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరికి వారికి సీటు కోసం ట్రై చేస్తున్నారు. అయితే సీటు దక్కకపోతే కొందరు పార్టీ మారే అవకాశం ఉంది…అలాగే పార్టీ లో ఉంటూనే…సీటు దక్కినవారిని ఓడించడానికి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నకిరేకల్‌లో రాజకీయం అలాగే నడుస్తోంది. ఈ నియోజకవర్గం మొదట నుంచి కమ్యూనిస్టుల కంచుకోట. 1978 నుంచి 2004 వరకు వరుసగా ఇక్కడ సి‌పి‌ఐ గెలిచింది.

2009లో కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్య గెలిచారు..2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి వేముల వీరేశం విజయం సాధించారు…అయితే 2018 ఎన్నికల్లో వీరేశంపై లింగయ్య విజయం సాధించారు. ఇక్కడ వరకు ఇద్దరు నేతలు ప్రత్యర్ధులుగానే తలబడ్డారు. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి అనూహ్యంగా టీఆర్ఎస్ లోకి వచ్చారు. దీంతో అసలు రచ్చ మొదలైంది. నియోజకవర్గంలో ఏనాడూ లింగయ్య, వీరేశం కలిసి పనిచేయలేదు…ఎవరికి వారే సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు.

పైగా టికెట్ తమదే అనుకుంటే తమదే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా వర్గపోరు వల్ల నకిరేకల్ లో టీఆర్ఎస్ పార్టీ పరిస్తితి దిగజారుతూ వస్తుంది. ఈ ఇద్దరు నేతలని కలపకుండా నెక్స్ట్ ఎన్నికల్లో వీరిలో ఎవరికి సీటు ఇచ్చిన టీఆర్ఎస్‌కు నష్టమే..ఒకరికి సీటు ఇస్తే..మరొకరు వారిని ఓడించడానికి పనిచేస్తారు. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే నకిరేకల్ సీటు టీఆర్ఎస్ కోల్పోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news