డాండ్రఫ్‌కు చెక్ పెట్టేందుకు సూపర్ చిట్కాలు.. మీకోసమే..!

-

ఎవరినైనా చూడగానే వాళ్లలో మొదట ఆకర్షించేది వారి డ్రెస్సింగ్ స్టైల్. ఆ తర్వాత వారికి అందాన్ని తీసుకొచ్చేది వారి జుట్టు. ముఖ్యంగా అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేసేవి ఆరోగ్యకరమైన కురులు. కానీ చాలా మంది ఈ జుట్టు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా జుట్టు విషయంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య చుండ్రు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడొచ్చంటున్నారు వైద్య నిపుణులు. మరి ఆ చిట్కాలేంటో చూసేయండి.. మీ జుట్టును వత్తుగా.. నిగనిగలాడేలా చేసుకోండి..

 

తల వెంట్రుకలు డ్యామేజీ కాకుండా ఆరోగ్యకరంగా ఉండాలంటే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. లేకపోతే చుండ్రు సమస్య తీవ్రంగా బాధిస్తుంది. విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అరోగ్య సమస్యలు, నీళ్లు పడకపోవడం, ఒత్తిడి.. వంటి అనేక కారణాలతో చుండ్రు వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ చుండ్రు బాధ నుంచి విముక్తి ఎలా పొందాలంటే..

  • జుట్టు రక్షణలో ఆలివ్‌ ఆయిల్‌ కీలకంగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు తల భాగంలో రక్తప్రసరణ సాఫీగా జరుగడంలో తోడ్పడతాయి. ఈ ఆయిల్‌లోని పోషకాలు హెయిల్‌ ఫోలికల్స్‌కు పోషణ అందిస్తాయి.
  • సాధారణంగా ఇంట్లో అందరూ ఒకే దువ్వెనతో తల దువ్వుకుంటారు. కానీ అలా చేయరాదు. ఎవరి దువ్వెనతో వారే దువ్వుకోవాలి. కొన్ని సార్లు ఒకరి తలలో ఉండే ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు దువ్వెనల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. కనుక ఎవరి దువ్వెనలను వారు వాడితేనే మంచిది.
  • బాగా ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలను తినడం, అధికంగా మద్యం సేవించడం వల్ల కూడా చుండ్రు వస్తుంటుంది. కనుక ఈ పదార్థాలకు దూరంగా ఉంటే చుండ్రును తగ్గించుకోవచ్చు.
  • ఒత్తిడిని తగ్గించేలా నిత్యం ధ్యానం, యోగా వంటివి చేస్తే చుండ్రు రాకుండా ఉంటుంది.
  • రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను షాంపూ లేదా కొబ్బరినూనెలో కలిపి రాసుకుని.. ఆ తరువాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు త్వరగా తగ్గుతుంది.
  • ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె విత్తనాలు, వాల్‌నట్స్ తింటే వెంట్రుకల సమస్యలన్నీ పోతాయి. ముఖ్యంగా చుండ్రు తగ్గుతుంది.
  • బేకింగ్‌ సోడాను తలపై పోసి బాగా మర్దనం చేయడం ద్వారా కూడా డాండ్రఫ్‌ను నివారించుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని తడి జుట్టుకు బాగా రాయాలి. అనంతరం 2 నిమిషాలు ఆగి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
  • ఆస్ప్రిన్‌ మాత్రల్లోని సాలిసిలిక్‌ యాసిడ్ డాండ్రఫ్‌ను నివారించడంలో గ్రేట్‌గా పనిచేస్తుంది. ఈ మాత్రలు రెండింటిని తీసుకుని పొడిచేసి రెగ్యులర్‌ షాంపూతో కలిపి తలకు మర్దనం చేయాలి. రెండు, మూడు నిమిషాల తర్వాత తలను మంచి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రును అరికట్టవచ్చు.
  • పెరుగులోని బ్యాక్టీరియా చుండ్రు నివారణలో గ్రేట్‌గా ఉపయోగపడుతుంది. తొలుత తల వెంట్రుకలకు రెగ్యులర్‌ షాంపూను రాయాలి. అనంతరం పెరుగును వెంట్రుకల మొదళ్ల వరకు వెళ్లేలా పూయాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత నీటితో కడగాలి.
  • నిమ్మరసం కూడా డాండ్రఫ్‌ నివారణకు వాడి మంచి ఫలితాలను పొందవచ్చు. నిమ్మరసంను జుట్టు మొదళ్ల వరకు వెళ్లేలా రాయాలి. 2,3 నిమిషాలు ఆరబెట్టి అనంతరం రెగ్యులర్‌ షాంపూతో కడగాలి. ఇలా డాండ్రఫ్‌ పూర్తిగా కనుమరుగయ్యేంత వరకు నిమ్మరసం అప్లై చేయడం ఉత్తమం.
  • అలోవెరా చర్మం చికాకును తగ్గించడమే కాకుండా మాయిశ్చరైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది ఫ్లాకీనెస్, దురదను తగ్గిస్తుంది. అలాగేచుండ్రు నుంచి ఉపశమనం ఇస్తుంది.
  • టీ ట్రీ ఆయిల్ మంట, దురద, జిడ్డును తగ్గిస్తుంది. ఇది చుండ్రును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని రుజువు చేసింది.
  • మెంతి గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండి.. జుట్టు పొడిబారడం, రాలడాన్ని.. చుండ్రును నివారిస్తాయి.
  • జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి నూనె, బాదం నూనె, జోజోబా ఆయిల్, ఆర్గాన్ ఆయిల్ వాడటం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news