గ్రేటర్‌ వరంగల్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. 75కోట్లతో స్మార్ట్‌ బస్‌స్టేషన్‌

-

గ్రేటర్‌ వరంగల్‌లో రూ.75 కోట్లతో స్మార్ట్‌ బస్‌స్టేషన్‌ను నిర్మించేలా ప్రణాళిక సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ ప్రాంతంలోనే ఆర్టీసీ, కుడా సంయుక్తంగా కొత్త భవన నిర్మాణ ప్రక్రియను చేపట్టనున్నాయి. రెండున్నర ఎకరాల స్థలంలో ఐదు అంతస్తులతో 32 బస్సు ప్లాట్‌ఫారాలు ఉండేలా డిజైన్‌ చేశారు. విశాలమైన ఈ భవనంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌, ఇతర వసతులు ఉంటాయి. వరంగల్‌ రైల్వేస్టేషన్‌, కొత్తగా నిర్మించనున్న నియో మెట్రో రైలు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతులు కల్పించేలా ఈ రెండింటికీ అనుసంధానం చేస్తూ స్మార్ట్‌ బస్టాండ్‌ను తీర్చిదిద్దనున్నారు.

వరంగల్‌లో రూ.75 కోట్లతో స్మార్ట్‌ బస్‌స్టేషన్‌

ఇదిలా ఉంటే.. ఇటీవల రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎప్పటికీ చెక్కుచెదరకుండా.. అద్దాల మాదిరిగా రోడ్లు ఉండేలా.. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పాడైన రోడ్ల మరమ్మతులు, పనుల్లో నాణ్యత పెంచాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. అంతేకాకుండా.. రోడ్లు భవనాల శాఖలో చేపట్టాల్సిన నియామకాలపై కూడా చర్చించారు.

Read more RELATED
Recommended to you

Latest news