పాలకూరతో ఇన్ని ప్రయోజనాలట.. గర్బిణీలకూ ఎంతో మేలే..!

-

పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మనం పాలకూర తో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. పాలక్ పన్నీర్ మొదలు కూర, పప్పు వంటివి వండుకోవచ్చు. నిజానికి పాలకూర వల్ల అద్భుతమైన లాభాలు పొందొచ్చు. గర్భిణీలకు కూడా పాలకూర ఎంతగానో మేలు చేస్తుంది. పాలకూర వల్ల కలిగే ఉపయోగాలు చూస్తే ఆశ్చర్యపోతారు. మరి నిజానికి పాలకూర వల్ల ఎన్ని లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

కీళ్ల నొప్పులు సమస్య ఉండదు:

పాలకూరలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్-కె కూడా ఇందులో ఉంటుంది. పాలకూరను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇది ఎంతో మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది:

పాలకూరను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులో నైట్రేట్ ఉంటుంది ఇది గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను కూడా తగ్గిస్తుంది.

రక్తహీనత సమస్య ఉండదు:

అనీమియా సమస్యతో బాధపడే వాళ్ళు పాలకూరను తీసుకుంటే మంచిది ఇది రక్తాన్ని పెంచుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ ని తీసుకు రావాలంటే ఐరన్ చాలా ముఖ్యం. కనుక తప్పక దీన్ని డైట్ లో చేర్చుకోండి.

బరువు పెరగరు:

పాలకూరను తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు పాలకులను ఎక్కువ తీసుకున్నా సరే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరగడానికి అవ్వదు.

గర్భిణీలకు మంచిది:

పాల కూర తినడం వల్ల గర్భిణీలకు ఎంతో మేలు కలుగుతుంది. బిడ్డకు వెన్నెముక సమస్యలు రాకుండా ఉంటాయి బిడ్డ యొక్క బ్రెయిన్ ఎదుగుదలకు కూడా సహాయం చేస్తుంది. ఇలా ఇన్ని లాభాలను మనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news