కేసీఆర్ బతికున్నంత వరకు టిఆర్ఎస్ నేషనల్ పార్టీ కాలేదు – ధర్మపురి అర్వింద్

-

ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని.. పి ఎఫ్ ఐ వ్యవహారంలో టిఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కు, డిజిపి మహేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశాను.. ఎన్ఐఏ ద్వారా దర్యాప్తు చేయాలని కోరానన్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశం మ్యాప్ ను మార్చారు… పార్టీ రిజిస్టర్ కాలేదు, కేసీఆర్ బతికున్నంత వరకు టిఆర్ఎస్ నేషనల్ పార్టీ కాలేదని విమర్శలు చేశారు.

పసుపు రైతులు, పోటీ చేసిన అభ్యర్థులు, రైతు ప్రతినిధులు తమ పార్టీలో చేరుతున్నారు.. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే పసుపు రైతులకు న్యాయం అని ఫైర్ అయ్యారు. మునుగోడులో టిఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని.. మునుగొడుకు ప్యాకేజి కాదు అధికారంలోకి వచ్చాక తెలంగాణ అంతటా ప్రత్యేక ప్యాకేజి తో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 20 ఏళ్ల కిందటే రాజ గోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ అని.. కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గులాబీ శాలువా కప్పి స్పీచ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోవడం లేదు.. పార్టీ నిర్ణయం మేరకు నా పోటీ ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news