తెలంగాణలో భూసార పరీక్షలు జరపడం లేదు – నిర్మల సీతారామన్

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటన మూడవరోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై  తీవ్ర విమర్శలు గుప్పించారు నిర్మల సీతారామన్. తెలంగాణలో భూసార పరీక్షలు జరపడం లేదంటూ మండిపడ్డారు. దీనివల్ల ఎక్కువ పంటలు పండడం లేదని అన్నారు. ఏ సమయంలో ఏ పంట వేయాలి అనేదానిపై సాయిల్ హెల్త్ కార్డు ఇస్తున్నామన్నారు. రైతులు సోలార్ ఎనర్జీని పొలాల్లో పెట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుందన్నారు నిర్మల. సోలార్ తో మీ పంటతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా చేసుకోవచ్చన్నారు.

రైతులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటే ఐదు సంవత్సరాల వరకు టాక్స్ కట్టనక్కర్లేదన్నారు. ఉత్తర ప్రదేశ్ లో 100 మందిలో 52 మందికి రుణమాఫీ చేసినట్లు తెలిపారు. అలాగే కర్ణాటకలో 100 కి 38, పంజాబ్లో 100 కి 24, మధ్యప్రదేశ్లో 100 కి 12, తెలంగాణలో మాత్రం 100 మందిలో కేవలం ఐదుగురికే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. కృష్ణ వికాస్ యోజన పేరుతో 8590 కోట్లు ఇచ్చామన్నారు. తెలంగాణలో మొత్తం రైతులకి 10729 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ కేంద్రం ఏమీ ఇవ్వట్లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం భారం మోపట్లేదు.. అన్నీ మేము ఇస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news