ఆ మంత్రులు ఎక్కడ? జగన్ ఇమేజ్‌తోనే?

-

మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ జగన్ ఇమేజ్ తోనే గెలవనుందా? వైసీపీలో సొంత బలంతో గెలిచేవారు తక్కువ ఉన్నారా? అంటే ప్రస్తుత పరిస్తితులని చూస్తే అలాగే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కేవలం జగన్‌ని చూసే ప్రజలు వైసీపీకి ఓటు వేశారు. కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరు అనేది కూడా పట్టించుకోలేదు. కేవలం జగన్ బొమ్మ,వైసీపీ గుర్తు చూసి ఓటు వేశారు. అలా దాదాపు వంద పైనే ఎమ్మెల్యేలు గెలిచి ఉంటారు. పార్టీ బలంతో పాటు సొంత బలంతో గెలిచిన వారు తక్కువగానే ఉంటారనే చెప్పవచ్చు.

అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా జగన్ బొమ్మతో గెలిచేద్దామని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు జగన్‌ని మాత్రమే చూస్తున్నారు. అలా అని ప్రజల్లో బలం పెంచుకోవాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. ఇక మంత్రులు కూడా దీనికి అతీతం కాదు. ఏదో కొంతమంది తప్ప మిగిలిన వారు అడ్రెస్ కూడా లేరు. విచిత్రమైన విషయం ఏంటంటే..కొందరు మంత్రులు అనే సంగతి చాలమందికి ప్రజలకు తెలియదు. అంటే అలాంటి పరిస్తితి ఉంది.

ఏదో కొంతమంది మాత్రమే ప్రజల్లో ఉంటున్నారు..ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. జోగి రమేష్, రోజా, అంబటి, పెద్దిరెడ్డి, విడదల రజిని, బొత్స, గుడివాడ, సీదిరి అప్పలరాజు లాంటి వారు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. ఇక బుగ్గన ఆర్ధిక పరమైన అంశాల్లో బిజీగా ఉన్నారు. ఆయన్ని పక్కన పెడితే…ఏదో కొంతమంది అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.

ఇక గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, రాజన్న దొర, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, బూడి ముత్యాలనాయుడు లాంటి వారు అడ్రెస్ లేరనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం జగనే చూసుకుంటున్నారనే ధైర్యంతోనే చాలామంది వైసీపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఎంత జగన్ ఇమేజ్ ఉన్నా సరే..నేతలు కూడా కష్టపడితే పార్టీ గెలుపు ఇంకా సులువు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version