హైదరాబాద్లోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడిని పట్టుకుని మర్మాంగంపై టపాసులు పేలుస్తూ వీడియో తీసిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర్ప్రదేశ్ ఖుషీనగర్కు చెందిన 16 ఏళ్ల బాలుడిని.. బాసర గుడిలోని టపాసుల కర్మాగారంలో పని చేసేందుకు వారి బంధువులు మూడు నెలల క్రితం పంపించారు. కొన్ని రోజుల నుంచి ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక యువకులు దీపావళి పండుగ రోజున అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు.
కొందరు యువకులు కలిసి బాలుడిని కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. తనను వదిలిపెట్టాలని అతడు ఏడుస్తూ బతిమాలినా కనికరించలేదు. ఆ బాలుడి మర్మాంగంపై టపాసులు పేలుస్తూ.. వీడియో తీసి పైశాచికానందానికి పాల్పడ్డారు. తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బాధితుడి సెల్ఫోన్ కూడా లాక్కున్నారు. వైరల్ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు.. ఘటనపై యూపీలోని ఖుషీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు మానసిన వైకల్యంతో ఇబ్బందిపడుతున్నారని తల్లింద్రుడులు చెప్పారు. దీనిపై స్థానిక పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.