అధికార పార్టీ అండతోనే రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతున్నాయని భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. లక్ష రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఇటువంటి దారుణ ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉండటం సరికాదన్నారు. ప్రజలను రక్షించాల్సిన అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని పేటే పోతున్నారని సోము వీరాజు.
కాగా, అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ‘ఇటీవల హత్యకు గురికాబడిన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని నేడు పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించాను. రాజకీయాలకు కొమ్ము కాయకుండా దోషులకు కఠినమైన శిక్ష పడేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.