మెగాస్టార్ నట వారసుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్‌గా వీరి 11వ వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇంతలోనే వీరి ఇంట్లో కొత్త వక్తి అడుగుపెట్టడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉపాసన ఇవాళ ఉదయం హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. తొలిసారి తల్లిదండ్రులైన రామ్ చరణ్, ఉపాసన దంపతులపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా, రామ్ చరణ్ బాబాయి, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఆశీస్సులు అందజేశారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు ఆడబిడ్డ జన్మించిన తరుణాన ప్రేమపూర్వక శుభాకాంక్షలు… శుభాశీస్సులు అంటూ పవన్ ఓ ప్రకటన చేశారు.
మెగా ఇంట కొత్త కుటుంబ సభ్యురాలు వచ్చిన సందర్భంగా అత్యంత సంతోషకర వాతావరణం నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన 2012 జూన్ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఇరువురు పెళ్లిరోజు జరుపుకున్నారు.