లాక్డౌన్ సమయం నుండి సినీ నటుడు సోనూసూద్ తన ఉదారతను చాటుతూనే ఉన్నారు. తాజాగా యాదాద్రి భునవగిరి జిల్లాకు చెందిన ముగ్గురు అనాథ పిల్లలకు చేయూతనందించి తన దయా హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. వారం క్రితం తల్లి అనారోగ్యంతో మృతిచెందడంతో అనాథలుగా మారిన ముగ్గురు చిన్నారుల దీనస్థితిని రాజేశ్ అనే వ్యక్తి ట్విటర్లో సోనూకు ట్యాగ్ చేయడంతో, వారి బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
They are no longer orphans.
They will be my responsibility ❣️ https://t.co/pT0hQd4nCx— sonu sood (@SonuSood) July 31, 2020
సోనూసూద్ తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరోనా కష్టకాలంలో వలస కార్మికులను ఆదుకోవడం దగ్గరి నుంచి ఇటీవల వరంగల్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శారద.. ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకునే విషయం తెలుసుకుని ఆదుకునే వరకు విశ్రాంతి లేని యోధుడిగా సినీ నటుడు సోనూసూద్ అందరికీ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.