సఫారీలకు చుక్కలు చూపించిన భారత బౌలర్లు.. టీమిండియా టార్గెట్ 107

-

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు తిరువనంతపురంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. అయితే.. తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. తొలి టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. కేశవ్ మహరాజ్ 41 పరుగులు చేయగా, ఐడెన్ మార్ క్రమ్ 25, వేన్ పార్నెల్ 24 పరుగులు చేశారు.

IND vs SA: Strongest India Playing XI For South Africa T20Is

 

టీమిండియా బౌలర్ల ధాటికి ఓ దశలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీలు… 100 పరుగుల మార్కు అందుకున్నారంటే ఆ క్రెడిట్ కేశవ్ మహరాజ్ కే దక్కుతుంది. కేశవ్ మహరాజ్ 35 బంతులు ఎదుర్కొన్ని 5 ఫోర్లు, 2 సిక్సులతో విలువైన పరుగులు జోడించాడు. అతడికి పార్నెల్ నుంచి మంచి సహకారం లభించింది. సఫారీ ఇన్నింగ్స్ లో నలుగురు డకౌట్ అయ్యారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, దీపక్ చహర్ 2, హర్షల్ పటేల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news