బాన్సువాడపై బండి ఫోకస్..స్పీకర్‌కు సెంటిమెంట్ టెన్షన్.!

-

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ..బి‌ఆర్‌ఎస్ కంచుకోట అని చెప్పడం కంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి అడ్డా అని చెప్పవచ్చు. అక్కడ ఆయన ఆరుసార్లు గెలిచారు. గతంలో బాన్సువాడలో టి‌డి‌పికి పట్టు ఉండేది. 1983, 1985, 1989, 1994, 1999, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి గెలిచింది. అందులో 1994, 1999, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పోచారం గెలిచారు. కానీ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టి‌డిపీకి రాజీనామా చేసి బి‌ఆర్‌ఎస్ లో చేరారు.

ఈ క్రమంలో 2011లో వచ్చిన ఉపఎన్నికలో ఆయన బి‌ఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో పోచారం వరుసగా గెలిచారు. ఆయన ఇప్పుడు స్పీకర్ పదవిలో ఉన్నారు. అయితే రాజకీయంగా బాన్సువాడలో పోచారం స్ట్రాంగ్ గానే ఉన్నారు. కానీ ఆయనకు చెక్ పెట్టాలని ఇటు కాంగ్రెస్, అటు బి‌జే‌పిలు ట్రై చేస్తున్నాయి. బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..బాన్సువాడపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటీవల అక్కడ బి‌జే‌పిలోకి పెద్ద ఎత్తున వలసలు నడిచాయి.

 

 

అయితే గతంలో చంద్రబాబు కేబినెట్ లో స్టేషనరీ కుంభకోణంలో బర్త్‌రఫ్ అయిన వ్యక్తి పోచారం అంటూ బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారని, ఇక బాన్సువాడలో ఆయన కొడుకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కోరారు.

కాకపోతే బాన్సువాడలో పోచారం స్ట్రాంగ్ గానే ఉన్నారు..కాకపోతే ఆయనకో టెన్షన్ ఉంది..తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ గా పనిచేసిన వారు మళ్ళీ గెలవడం కష్టం. ఇక తెలంగాణ మొదట స్పీకర్ గా పనిచేసిన మధుసూదనచారి సైతం ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే పోచారం రిస్క్ లో ఉన్నట్లే..మరి ఆ సెంటిమెంట్‌ని పోచారం బ్రేక్ చేస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news