అప్పడాలతో కూరను ఎప్పుడైనా ట్రై చేసారా?

-

మాములుగా కరకరలాడే అప్పడాలను పప్పు లో లేదా సాంబార్ లో నంజుకొని తింటారు. కానీ వీటితో కూడా కూర చేస్తారని అంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజమని చెబుతున్నారు.. ఈ వెరైటీ కర్రిని ఎలా చేయాలో ఆలస్యం లేకుండా ఇప్పుడు చూద్దాం..

 

కావలసిన పదార్థాలు..

అప్పడాలు : ఆరు
పెరుగు : ఒక కప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి : ఒక స్పూన్
ధనియాల పొడి: ఒక స్పూన్
మెంతులు: అరస్పూన్
ఇంగువ: చిటికెడు
పసుపు :పావు స్పూన్
మెంతి ఆకులు : పావు స్పూన్

తయారీ విధానం:

ముందుగా అప్పడాలను వేయించి పక్కనబెట్టుకోవాలి. ఇప్పుడు ఓ పాన్‌లో నూనె వేసి మెంతులు వేసి వేపాలి. మిర్చి ముక్కలు, ఇంగువ యాడ్ చేయాలి. కాస్త మంట తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి కలపాలి. అందులోనే ఒక కప్పు నీళ్లు పోసి, ఉప్పు కలపాలి. పెరుగు వేసి ఉడికించాలి. కూరలా అయ్యాక అప్పడాలను అందులో తుంచి వేయాలి. మెంతి ఆకులను కూడా కలుపుకోవాలి. మూతపెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాల అలానే ఉంచి దించేస్తే సరి అప్పడాల సబ్జీ రెడీ. అవసరమైతే ఓ గరిటెడు ఉడికించిన పప్పు, తరిగిన టమోటా, వెల్లుల్లి వేసి గ్రేవీ కావాల్సినంత చేసుకోవచ్చు. ఒకసారి తిన్నారంటే జీవితంలో వదలరు..టేస్టు అదిరిపోతుంది… చపాతీల లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది.మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news