శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. మరిన్ని ప్రత్యేక రైళ్లు..

-

ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య మరో నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఆగస్టు 15న సాయంత్రం 06.20 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07411) సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. అలాగే ఆగస్టు 16న సాయంత్రం 05.15 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07412) తిరుపతి నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.25 గం.లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేరం, కృష్ణ, రాయ్‌చూర్, మంత్రాలయం రోడ్, ఆధోని, గుంతకల్, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

అలాగే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య విజయవాడ మీదుగా రెండు సర్వీసుల ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. ఆగస్టు 17వ తేదీన సాయంత్రం 06.40 గం.లకు ప్రత్యేక రైలు (07473) సికింద్రాబాద్ నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.45 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది. ఎదురు దిశలో ఆగస్టు 18వ తేదీన సాయంత్రం 05.00 గం.లకు ప్రత్యేక రైలు (నెం.07474) తిరుపతి నుండి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 05.45 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. రెండు మార్గాల్లోనూ ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగతాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version