ASIA CUP 2022 : ఇండియాపై పాక్ గెలుస్తుందా..బాబర్ విజృంభిస్తాడా !

-

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. ముఖ్యంగా భారత్ – పాకిస్తాన్ లలోని క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆసియా కప్ ప్రారంభం కాబోతోంది. ఆసియాలో అతిపెద్ద క్రికెట్ ఈవెంట్ అంటే ఆసియా కప్. ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. భారత్ – పాకిస్తాన్ జట్లు చివరిసారిగా తేడాది జరిగిన టి -20 ప్రపంచ కప్ లో తలపడగా.. మళ్లీ ఆడలేదు. ఇప్పుడు ఆసియా కప్ టోర్నీ రూపంలో భారత్ – పాకిస్తాన్ మరోసారి సై అంటే సై అంటున్నాయి.

అయితే ఇప్పటివరకు జరిగిన ఆసియా కప్ లలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. భారత జట్టు 7 సార్లు ఆసియా కప్ గెలుచుకోగా.. పాకిస్తాన్ కేవలం 2 సార్లు మాత్రమే ఆసియా కప్ గెలుచుకుంది. పాక్ చివరిగా 2012లో ఆసియా కప్ గెలిచింది. శ్రీలంక నాలుగు సార్లు గెలుచుకోవడం విశేషం. ఇక ఐసీసీ టోర్నీల మాదిరిగానే ఆసియా కప్ లో కూడా పాకిస్తాన్ పై భారత జట్టు సత్తా చాటుతుంది. ఆసియా కప్ లో భారత్ వన్డే, టి20 ఫార్మాట్లలో పాక్ ని ఓడించింది.

టి20 ఫార్మాట్ గురించి మాట్లాడితే.. పాకిస్తాన్ తో ఆడిన ఒక మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. వన్డే ఫార్మార్ట్ లో భారత్ 13 మ్యాచ్ లలో 7 గెలిచింది. ఇక యూఏఈ గడ్డపై జరిగిన ఆసియా కప్ లో భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన 4 మ్యాచ్లలో పాకిస్తాన్ మూడుసార్లు ఓడింది. గతేడాది టి20 ప్రపంచ కప్ లో ఇదే వేదికలో పాక్ చేతిలో ఓటమి చెంది భారత్ ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది.

అయితే ఆగస్టు 28న జరగనున్న భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధిస్తుందని జోష్యం చెప్పాడు పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. పాకిస్తాన్ లోని స్పోర్ట్స్ టీవీతో మాట్లాడుతూూ.. పూర్తి విశ్వాసంతో పాకిస్తాన్ బరిలోకి దిగుతుందని.. గతేడాది కూడా ఇదే వేదికపై భారత్ ను మట్టి కరించామన్నారు. ఎందుకంటే యూఏఈ లో పరిస్థితులు పాకిస్తాన్ కి బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చారు. ఈసారి కూడా భారత్ పై మాదే విజయం అన్నారు సర్పరాజ్ అహ్మద్.

సర్పరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత్ అభిమానులు స్పందించారు. సర్పరాజ్ అహ్మద్ కి జట్టులో చోటే లేదు కానీ.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో విజయం ఎవరిది అనేది తేలాలంటే ఆగస్టు 28 వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news