ASIA CIP 2022 : చివరల్లో పాండ్యా సిక్స్‌..కిస్సులు పెట్టిన ఆఫ్ఘన్‌ ఫ్యాన్స్‌

-

ఆగస్టు 28వ తేదీ ఆదివారం జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టి20 మ్యాచ్ అందరినీ ఆకర్షించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. అయితే, ఈ మ్యాచ్ చేజింగ్ లో జడేజా ఆఖరి ఓవర్ మొదటి బంతికి నిష్క్రమించిన తర్వాత, నాలుగో బంతికి సిక్స్ బాది అద్భుత విజయం అందించాడు.

హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టగానే స్టేడియం తో పాటు దేశం మొత్తంలో సంబరాలు అంబరాన్నంటాయి. కేవలం భారతీయులే కాదు, ఆఫ్ఘనిస్తాన్ లోని అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆఫ్గానిస్థాన్ లోని కొందరు యువకులు భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూశారు.

ఉత్కంఠ మధ్య హార్దిక్ సిక్స్ బాధగానే ఓ యువకుడు పరిగెత్తుకుంటూ టీవీ స్క్రీన్ వద్దకు వచ్చి హార్దిక్ పాండ్యాను ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు. ఇది చూసిన అతడి స్నేహితులు నవ్వులు పూయించారు. ఈ వీడియో మహిళా హక్కుల కార్యకర్త యూసఫ్ జాయ్ అనయత్ షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news