ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్లు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో భాగంగానే జరిగిన నాలుగో మ్యాచ్లో టీమిండియాపై ఆస్ట్రేలియా ఐదో మ్యాచ్లో బంగ్లాదేశ్ పై, పాకిస్తాన్ విజయాలు సాధించాయి. వర్మాప్ మ్యాచ్ ఏ కదా అని తేలిగ్గా తీసుకున్న ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ జర్నీని ఓటమితో ప్రారంభించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తోలుతా బ్యాటింగ్ చేసిన ఆసీస్, భారత బౌలర్లు శిఖా పాండే, పూజా పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్నిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ, ఆశ్లే గార్డెనర్ ఓ మోస్తారుగా రాణించగా, ఆఖరిలో వేర్ హామ్, జోనస్సేన్ మెరుపు ఇన్నింగ్స్ లు ఆడటంతో ఆసీస్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం 130 పరుగులు సాధారణ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా, నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి 15 ఓవర్లలో 85 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఫలితంగా ఆసిస్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది.