తండ్రి కాబోతున్న టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్ !

-

టీమిండియా ప్లేయర్‌ యుజ్వేంద్ర చాహల్ తండ్రి కాబోతున్నాడా? అతని సతీమణి కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ గర్భవతా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా అతను షేర్ చేసిన ఓ పోస్టు ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చాలా చురుకుగా ఉండే చాహాల్ ఎప్పుడూ తనదైన పోస్టులతో నవ్వులు పూయిస్తాడు. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ సహచర ఆటగాళ్లకు చికాకు తెప్పిస్తాడు. టీమిండియా స్టార్ ఆల్ రౌండ్ యువరాజ్ సింగ్ ను అయితే కేసులపాలే చేశాడు.

ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా తన ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ట్విటర్ హ్యాండిల్ ను హ్యాక్ చేసి ఫన్నీ ట్వీట్స్ తో అభిమానులను అయోమయానికి గురిచేసాడు. తాననే తదుపరి కెప్టెన్ అంటూ రచ్చ చేశాడు. సహచర బ్యాటర్ జోష్ బట్లర్ ను ఓ ఆట ఆడుకున్నాడు. అంత సరదాగా ఉండే చాహల్ మంగళవారం సీరియస్ పోస్ట్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎన్నడూ లేని విధంగా ఓ క్రియేటివ్ పిక్చర్ ను షేర్ చేశాడు. దానిపై ‘న్యూ లైఫ్ లోడింగ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో అతని సతీమణి ప్రెగ్నెంట్ అయినట్టు ఉందని ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే చాహాల్ తండ్రి కాబోతున్నాడని అభినందనలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news