టెన్నిస్ దిగ్గ‌జం రాఫెల్ నాద‌ల్ కు కోవిడ్ పాజిటివ్

టెన్నిస్ దిగ్గ‌జ ఆట‌గాడు రాఫెల్ నాద‌ల్ కు కోవిడ్- 19 పాజిటివ్ అని తెలింది. ఈ విష‌యాన్ని రాఫెల్ నాద‌ల్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా ధృవీక‌రించాడు. పీసీఆర్ ప‌రీక్ష లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ని ప్ర‌క‌టించాడు. క‌రోనా కార‌ణం గా రాబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడ‌టం పై స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌లేన‌ని తెలిపారు. కాగ ప్ర‌పంచ టెన్నిస్ ఛాంపియ‌న్ షిప్ టోర్నమెంట్ లో గాయం తో ఇప్పుటి వ‌ర‌కు టెన్నిస్ కు దూరం గా ఉంటున్నాడు.

తాజాగా అబుదాబి లో ఈవెంట్ ను ముగించుకుని గ‌త వార‌మే స్పెయిన్ కు తిరిగి వ‌చ్చాడు. కాగ ఆయ‌న పాదాల గాయంతో గ‌త నాలుగు నెల‌ల పాటు సైడ్ లైన్ లోనే ఉన్నారు. కాగ ఇప్పుడు క‌రోనా పాజిటివ్ తేలడం తో మ‌రి కొన్ని రోజుల పాటు ఆయ‌న టెన్నిస్ కు దూరం గా ఉండ‌నున్నాడు. కాగ రాద‌ల్ ఆరోగ్యం నిల‌క‌డ గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. నాదల్ త‌న ఇంటి వ‌ద్ద ఐసోలేష‌న్ లో ఉన్నాడ‌ని వైద్యులు ప్ర‌క‌టించారు.