బుమ్రాకు బ్యాటింగ్ నేర్పించింది నేనే.. బుమ్రా భార్య సంజనా గణేషన్

టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. బుమ్రా ఈ రికార్డును బంతి తో కాకుండా బ్యాట్ తో చేయడం విశేషం. అతను ఒక ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్ గొప్ప బ్యాట్స్మెన్ బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు. భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఎడ్జ్బాస్టన్ టెస్ట్ రెండో రోజున బుమ్రా ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో చితక్కొట్టాడు.

తన ఒక్క ఓవరులో 29 పరుగులు పిండుకొని ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. మొత్తంగా బ్రాడ్ ఆ ఓవరులో 35 పరుగులు ఇచ్చాడు. ఈ విధంగా 18 ఏళ్ల క్రితం లారా నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు బూమ్రా. అయితే బుమ్రా తన దగ్గరే బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్నాడు అని అతని సతీమణి సంజనా గణేషన్ తెలిపింది. తాజాగా ఐసీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజనా గణేషన్ ముందు బూమ్రా బ్యాటింగ్ గురించి ప్రస్తావించగా ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తానే బమ్రా కు బ్యాటింగ్ నేర్పానని సరదాగా చెప్పుకొచ్చింది. బౌలింగ్ విషయాన్ని ప్రస్తావించగా దాని గురించి తనకు తెలియదని కేవలం బ్యాటింగ్ నేర్పించడం పైన ఫోకస్ పెట్టాను అని పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే సైతం ఈ ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు.