పూణె మొద‌టి వ‌న్డే.. ఇంగ్లండ్ టార్గెట్ 318..

పూణె వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మొద‌టి వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 317 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్ల‌లో శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లి, కృణాల్ పాండ్యాలు రాణించారు. దీంతో భార‌త్ భారీ స్కోరు చేయ‌గ‌లిగింది.

india made 317 runs in pune 1st odi against england

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భార‌త్ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో టీమిండియా 317 ప‌రుగుల స్కోరు చేసింది. 106 బంతులు ఆడిన ధ‌వ‌న్ 11 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 98 ప‌రుగులు చేయ‌గా, కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 62 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కృణాల్ పాండ్యా 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 58 ప‌రుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లి 60 బంతుల్లో 6 ఫోర్ల‌తో 56 ప‌రుగులు చేశాడు.

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో బెన్ స్టోక్స్ 3 వికెట్లు తీశాడు. మార్క్ వుడ్‌కు మ‌రో 2 వికెట్లు ద‌క్కాయి.