అండర్ – 19 ప్రపంచ కప్ లో యంగ్ టీమిండియా సెమీ ఫైనల్ కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్ లో డిఫెండిగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ను టీమిండియా చిత్తు చేసింది. 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగ గతంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను బంగ్లాదేశ్ ఓడించి ట్రోఫీ ని ఎగేరుసుకుపోయింది. ఆ ప్రతికారాన్ని తాజా గా ఈ వరల్డ్ కప్ లో టీమిండియా తీర్చుకుంది. కనీసం సెమీ ఫైనల్ లో కూడా అడుగు పెట్టకుండా షాక్ ఇచ్చింది.
కాగ ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆరంభంలోనే బంగ్లాదేశ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 56 పరుగుల వద్దే 7 వికెట్లను తీసి బంగ్లాదేశ్ ను కోలుకోని దెబ్బ తీసింది. భారత్ బౌలర్ల దాటికి కేవలం ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగలిగారు. మిగిత వాళ్లంతా.. సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. దీంతో 37.1 ఓవర్లనే 111 పరుగులకు ఆలౌట్ అయ్యారు. రవి కుమార్ 3 వికెట్లు తీశాడు. విక్కి 2 , కౌశల్ తంబే, రఘువన్ష, రాజవర్ధన్ తలో ఒక వికెట్ తీశారు.
112 పరుగల స్వల్ప లక్ష ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రఘువన్ష (44), రషీద్ (26) తో పాటు కెప్టెన్ యష్ ధుల్ (20) చేయడంతో 30.5 ఓవర్లనే ఛేదనను పూర్తి చేసింది. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమి కారణమైన రవికుమార్ కు దక్కింది.