గత రాత్రి ఈడెన్ గార్డెన్స్ కోల్కతా మరియు బెంగళూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా 81 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. కోల్కతా ఇచ్చిన 205 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో ఆర్సీబి విఫలం అయింది. గత మ్యాచ్ లో రాణించిన ఓపెనర్లు కోహ్లీ మరియు డుప్లేసిస్ మంచి ఆరంభాన్ని అందుకున్నా ఆ తర్వాత స్పిన్ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. నరైన్ కోహ్లీ ని 44 పరుగుల వద్ద బౌల్డ్ చేయగా ఆర్సీబి పతనం స్టార్ట్ అయింది.
అప్పటి నుండి ఈ దశలోనూ కోలుకోలేదు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి డుప్లిసిస్ ను బౌల్డ్ చేశాడు, ఆ తర్వాత 8 వ ఓవర్ లో మళ్లీ వరుణ్ రెండు వికెట్లు తీసి బెంగళూర్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ తర్వాత 19 ఏళ్ల యంగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ మ్యాజిక్ స్టార్ట్ అయింది. ఇతను మొత్తం మూడు వికెట్లు తీసి ఆరంభంలోనే మంచి ఘనతను సొంతం చేసుకున్నాడు. అలా బెంగళూర్ స్పిన్ దెబ్బకు మరో రెండు ఓవర్ లు మిగిలి ఉండగానే 123 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది. కోల్కతా బౌలర్ లలో వరుణ 4, నరైన్ 2, శర్మ 3 మరియు శార్ధూల్ 1 వికెట్ తీసుకున్నారు.