హిట్ మ్యానా.. మజాకా.. సిక్స్ కొడితే ఏకంగా బస్సు మీదకే..

సెప్టెంబర్ 19వ తేదీ నుండి ఐపీఎల్ 13వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నాయి. ముంబై ఇండియన్స్ టీమ్ ని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నడిపిస్తుండగా, చెన్నై సూపర్ కింగ్స్ కి ధోనీ సారథ్యం వహిస్తున్నాడని తెలిసిందే. ఐతే ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన బ్యాటింగ్ తో అందరినీ అలరించాడు.

రాత్రిపూట లైట్ల కింద ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మ, ఒక సిక్సర్ బాదాడు. ఐతే ఆ సిక్సర్ కి చాలా ప్రత్యేకత ఉంది. చాలా సింపుల్ షాట్ గా అనిపించినప్పటికీ సిక్సర్ బాదిన ఆ బంతి వెళ్ళి స్టేడియం బయట రోడ్డు మీద వెళ్తున్న బస్సు మీద పడింది. దాదాపుగా 95మీటర్ల అవతల పడింది ఆ బంతి. ఈ వీడియోని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుని మంచి క్యాప్షన్ ఇచ్చారు. బ్యాట్ మెన్ సిక్సర్ బాదుతారు. లెజెండ్స్ బంతిని స్టేడియం బయటకి పంపిస్తారు. కానీ హిట్ మ్యాన్ కొట్టిన బంతి స్టేడియం బయటకి వెళ్ళి కదులుతున్న బస్సును తాకుతుందని పెట్టారు.