చెన్నైలో మ్యాచ్ అనంతరం నేరుగా ఇంటికి వెళ్ళిపోయిన అశ్విన్

-

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమవుతున్నా బయోబబుల్ లో ఐపీఎల్‌ మ్యాచ్ లు మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఐపీఎల్‌ టోర్నీ మధ్య దశకు చేరుకొంటుంది. అయితే ఈ కీలక సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఈ ఐపీఎల్‌ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

ఆదివారం రాత్రి చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. తన కుటుంబ సభ్యులు కరోనాతో పోరాడుతున్నారని… ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సి ఉందని అందుకే ఐపీఎల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు అశ్విన్ పేర్కొన్నాడు. అయితే పరిస్థితులు చక్కబడితే తిరిగి ఐపీఎల్‌కు తిరిగి వస్తానని అశ్విన్ తెలిపాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం అశ్విన్ జట్టును వీడి అక్కడే చెన్నైలోని తన ఇంటికి వెళ్లిపోయినట్లు తెల్సింది.

కాగా ఐపీఎల్ 2021 తొలి విడతలో భాగంగా చెన్నై, ముంబయిలలో జరగాల్సిన మ్యాచ్‌లు ఆదివారంతో ముగిసాయి. మిగిలిన మ్యాచ్ లు అహ్మదాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా వేదికలుగా జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్‌ మ్యాచ్ లను బయోబబుల్ లో నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇక బీసీసీఐ నిబంధనల ప్రకారం ఎవరైనా ఆటగాడు లేదా సిబ్బంది బయోబబుల్ నుంచి బయటకు వెళ్లాలంటే బోర్డు అనుమతి తప్పని సరి. అలానే బయోబబుల్‌లో చేరడానికి బీసీసీఐ మెడికల్ బృందం అనుమతితో పాటు ఏడు రోజుల క్వారంటైన్‌లో తప్పకుండా ఉండాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news