ఐపీఎల్: ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మెరుపులు.. పంజాబ్ లక్ష్యం 192..

-

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ కి బ్యాటింగ్ అవకాశాన్ని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ తో డీసెంట్ స్కోరుని అందుకున్న ముంబై ఇండియన్స్, ఆ తర్వాత్ వచ్చిన కైరన్ పోలార్డ్, హార్థిక్ పాండ్యా విజృంభించడంతో స్కోరు 191పరుగులకి చేరుకుంది. నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఒక దశలో 150పరుగులు కూడా చేయగలదా అనుకుంటున్న సమయంలో పోలార్డ్, పాండ్యా బౌలర్లకి చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ 78 పరుగులు (45బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) చేసాడు. ఇషాన్ కిషన్ 28పరుగులు(32బంతుల్లో 1ఫోరు, 1సిక్సర్) చేసాడు.

నాటౌట్లుగా నిలిచిన పోలార్డ్ 47పరుగులు( 20బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) బాదగా, హార్థిక్ పాండ్యా 30పరుగులు( 11బంతుల్లో 3ఫోర్లు 2సిక్సర్లు) చేసాడు. ముంబై బౌలర్లలో కాట్రెల్, షమి, క్రిష్ణప్ప గౌతమ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. బౌలర్లలో కాట్రెల్ ఒక్కడే డీసెంట్ పర్ ఫార్మ్ చేసాడు. నాలుగు ఓవర్లు వేసిన కాట్రెల్ 20పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మిగతా అందరూ విపరీతంగా పరుగులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news