వాళ్ళకి వచ్చినంత హైప్ ఆ బౌలర్ కి రావట్లేదు కానీ.. గౌతమ్ గంభీర్..

-

దుబాయ్ లో జరుగుతున్న ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న బౌలర్లలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో పంజాబ్ కి చెందిన మహమ్మద్ షమి, కోల్ కతా నైట్ రైడర్స్ పాట్ కమ్మిన్స్, రాజస్తాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్, ఢిల్లీ కేపిటల్స్ కేసిగో రబాడ్, సన్ రైజర్స్ రషీద్ ఖాన్ మొదలగు వారందరూ ఉన్నారు. వీరందరితో పోటీ పడుతూ బౌలింగ్ ఛార్ట్ లో టాప్ లోకి దూసుకువస్తున్న మరో బౌలర్ కూడా ఉన్నాడు. అతడే యుజ్వేంద్ర చాహల్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చెంచిన యుజ్వేంద్ర చాహల్ క్మి మిగతా బౌలర్లంతా హైప్ రానప్పటికీ అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ విషయమై కోల్ కతా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్, యుజ్వ్ ఏంద్ర చాహల్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సీజన్లో 5మ్యాచులాడిన చాహల్ 8వికెట్లు తీసుకున్నాడు. కానీ ఈ బౌలర్ గురించి అంతగా మాట్లాడుకోవట్లేదని అన్నాడు. రషీద్ ఖాన్, రబాడ్, పాట్ కమ్మిన్స్ ల గురించి మాట్లాడినంతగా చాహల్ గురించి మాట్లాడుకోవట్లేదని, మరికొద్ది రోజుల్లో చాహల్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారని అన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ తో జరిగిన మ్యాచులో మూడు ఓవర్లు వేసిన చాహల్ ఒక్క వికెట్ కూడా తీసుకోలేదన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news