క్రికెట్: కెప్టెన్ గా కోహ్లీ దిగిపోవడంపై పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్య.. కన్ఫ్యూజన్ లో అభిమానులు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై సర్వతా షాక్ వెల్లడైంది. గంగూలీ, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, మైకేల్ వాన్ సహా చాలామంది ప్రముఖులు ఈ నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని వెల్లడి చేసారు. టీ20 ఫార్మట్ కి కెప్టెన్ గా తప్పుకుంటున్నానంటూ కోహ్లీ అధికారికంగా ప్రకటించాడు. యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్ గా వైదొలుగుతున్నానంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్ద లేఖ రాసారు.

అంతర్జాతీయ టెస్టులు, అంతర్జాతీయ వన్డే జట్లకు కెప్టెన్ గా ఉంటానంటూ చెప్పారు కూడా. ఐతే ఈ విషయమై కెవిన్ పీటర్సన్ చేసిన వ్యాఖ్య ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ అయిన కెవిన్ పీటర్సన్, విరాట్ కోహ్లీ రాసిన పూర్తి వివరాలను మొత్తం చదివి కేవలం ఫైర్ అన్న ఎమోజీని మాత్రమే పెట్టాడు. అంటే కెవిన్ పీటర్సన్ ఏమన్నాడనేది అభిమానులేవరికీ అర్థం కాలేదు. టీ20 ఫార్మట్ కి కెప్టెన్ గా దిగిపోతున్నానని చెబితే ఫైర్ ఎమోజీ పెట్టడం ఏంటన్నది కన్ఫ్యూజింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఆసక్తికర కథనాలు అల్లుతున్నారు.