రెప్ సోల్ 150 బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో వైరల్..!

-

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి సరికొత్త విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే అతనికి ఉన్న క్రేజీ అలాంటిది మరీ.ముఖ్యంగా ఎం.ఎస్. ధోనికి బైకులు అంటే ఎంత ఇష్టమో దాదాపు అందరికీ తెలిసిందే. సాధారణంగా మార్కెట్ లోకి ఏదైనా కొత్త బైకులు వచ్చాయంటే దానిని కొని తన గ్యారేజీలో పెట్టేంత వరకు అస్సలు నిదురపోనే పోడు.

ఇప్పటికీ కూడా తన గ్యారేజీలో బైకులు చాలానే ఉన్నాయి. తాజాగా కెప్టెన్ కూల్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రాంచీలో తన హోండా రెప్ సోల్ 150 బైకుపై ధోనీ రైడింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే తన ఇంటి వద్దకు ధోని చేరుకున్నాడు. ఇక ఇదే  సమయంలో ఓ అభిమాని తన ఫోన్ లో వీడియోని షూట్ చేశాడు. ఒక ఫొటో దిగేందుకు ఛాన్స్ ఇవ్వాలని అభిమానులు కోరారు. కానీ అప్పటికే ధోనీ తన రెప్ సోల్ 150 బైకుతో  ఇంట్లోకి వెళ్లిపోయాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

https://www.instagram.com/reel/Cv46cSrsACs/?utm_source=ig_embed&ig_rid=ec67e476-5fab-4198-a53c-d9793447a833

Read more RELATED
Recommended to you

Latest news