ఐపిఎల్ 2023 లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ 19 బంతుల్లో… క్లాస్ ప్లేయర్ రహానే !

-

చెన్నై సూపర్ కింగ్స్ 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే మొదటి ఓవర్ లోనే ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది … కాన్ వే ను బెహ్రెన్ డార్ఫ్ డక్ ఔట్ గా పంపించాడు. దీనితో ముంబై శిబిరంలో గెలుపు పై కాస్త ఆశలు రేగాయి.. కానీ మోస్ట్ సీనియర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే ముంబై బౌలర్లను ఆటాడుకుంటాడని ఎవరూ ఊహించలేదు. రహానే క్రీజులోకి వచ్చిన క్షణం నుండి అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ నాలుగవ ఓవర్ అర్షద్ ఖాన్ బౌలింగ్ చేశాడు.

ఈ ఓవర్ లో వరుసగా 6,4,4,4,4,1 తీసి మొత్తం 23 పరుగులు పిండుకున్నాడు. ఇలా వేగంగా ఆడుతూ కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేసి ఈ ఐపిఎల్ సీజన్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. కానీ 61 పరుగుల వద్ద ఉండగా చావ్లా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు మరియు 3 సిక్సులు ఉన్నాయి. ఇతని ఇన్నింగ్స్ యువ ఆటగాళ్లకు ఒక చక్కని ఉదాహరణ అని చెప్పాలి. వయసు పెరుగుతున్నా ఇంకా తనలో టీ 20 ఆడే శక్తి, టెక్నిక్ ఉందని ప్రూవ్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news