గిల్, కోహ్లీ సెంచరీలు మిస్..!

-

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీతో పాటు ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌లు సెంచరీలు మిస్‌ చేసుకున్నారు. శతకాల దిశగా సాగిన ఈ ఇద్దరూ.. కీలక సమయంలో నిష్క్రమించారు. నాలుగు పరుగుల వద్దే భారత్‌.. రోహిత్‌ వికెట్ కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ… శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి లంక బౌలర్ల పనిపట్టాడు. 49 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన రన్‌ మిషీన్‌.. సెంచరీ దిశగా వేగంగా సాగాడు. కోహ్లీతో పాటు సమాంతరంగా ఆడిన గిల్‌ కూడా 55 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

లంక బౌలర్లపై ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన కోహ్లీ, గిల్‌లు 80లలోకి వచ్చాక ఇక సెంచరీలు చేయడం ఖాయమే అని అనిపించింది. హేమంత వేసిన 29వ ఓవర్లో సిక్సర్‌, ఫోర్‌ కొట్టిన గిల్.. 80లలోకి వచ్చాడు. మధుశంక వేసిన 30వ ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన గిల్‌.. అదే ఓవర్లో ఆఖరి బంతికి వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 92 బంతులు ఆడిన గిల్‌.. 11 బౌండరీలు, రెండు సిక్సర్లతో 92 పరుగులు చేసి నిష్క్రమించాడు. గిల్‌ వికెట్‌ కోల్పోవడం ద్వారా 187 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లీ శతకానికి చేరువగా రావడంతో వాంఖెడేలో సచిన్‌ ఎదుట అతడి వన్డే సెంచరీల (49) రికార్డును కోహ్లీ సమం చేస్తాడని అంతా ఆశించారు. కానీ మధుశంక భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అతడు వేసిన 32వ ఓవర్లో మూడో స్లో బంతిని ముందు పుష్‌ చేయబోయిన కోహ్లీ.. షాట్‌ కవర్‌ వద్ద పతుమ్‌ నిస్సంకకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 94 బంతులాడిన కోహ్లీ.. 11 బౌండరీల సాయంతో 88 పరుగులు చేశాడు. క్రీజులో పాతుకుపోయిన గిల్‌, కోహ్లీలు నిష్క్రమించారు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 357 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version