INDvsAUS : ఖింఖనా గ్రౌండ్ దగ్గర గాయపడ్డ మహిళ ఆరోగ్యం పరిస్థితి మరింత విషమం !

సికింద్రాబాద్‌లోని త్రిముల్‌ గిరి నివాసి సయ్యద్ అలియా (19), INDvsAUS T20 క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ కొనుగోలు కోసం జింఖానా గ్రౌండ్స్‌లో క్యూలో నిలబడి తీవ్ర గాయాల పాలైంది. గేటు తెరిచిన వెంటనే తొక్కిసలాటలో పడిపోయి గాయపడగా, ఆమెను యశోదకు తరలించారు. ఆసుపత్రిలో, ఆమెకు అంతర్గత రక్తస్రావం ఉందనీ ఆమె కళ్ళు ఎర్రగా అయ్యాయనీ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

యశోద ఆసుపత్రి లో తదుపరి చికిత్స కోసం అడ్వాన్స్ మొత్తాన్ని డిపాజిట్ చేయమని, లేదా ఆసుపత్రి నుండి వెళ్లిపోవాలని కోరుతున్నారని తల్లి కంట తడి పెట్టింది.ఇదిలా ఉండగా తెలంగాణ క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు హెచ్‌సిఎ అధ్యక్షుడు అజారుద్దీన్ సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో తొక్కిసలాటలో గాయపడిన వారందరికీ హెచ్‌సిఎ వైద్య చికిత్స ఖర్చును భరిస్తుందనీ స్పష్టం చేశారు.