ఐపీఎల్ 2023 టైటిల్ విన్నర్ ఎవరో చెప్పిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ !

-

రేపటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 అంగరంగ వైభవంగా ఆరంభం కానుంది. మొత్తం పది టీం లు ఐపీఎల్ టైటిల్ రేస్ లో ఉన్నాయి. గత ఐపీఎల్ సీజన్ లో మొదటిసారి టోర్నీలోకి అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి మొదటి టైటిల్ ను అందుకుంది. ప్రస్తుతం ఆడుతున్న 10 జట్లలో ఈసారి ఐపీఎల్ గెలవబోయే జట్టు ఎవరు అన్నది ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తన జోశ్యం చెప్పాడు.

వాన్ మాట్లాడుతూ గత సంవత్సరం ఐపీఎల్ లో సీజన్ మొత్తం అద్భుతంగా ఆడి ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ స్మార్ట్ ప్లే ముందు తలవంచక తప్పలేదు. కానీ ఈసారి మాత్రయం రన్నర్ అప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ టైటిల్ ను ఎగరేసుకుపోతుంది అంటూ చెప్పాడు. మరి ఈ సీజన్ లో విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version