ఐపీఎల్ 2023: ఫామ్ లో ఉన్న శుబ్ మాన్ గిల్ ను చాహర్ అవుట్ చేస్తాడా ?

-

ఐపీఎల్ 2023 లో రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు ఇండియా యంగ్ ప్లేయర్ శుబ్ మాన్ గిల్. ఇప్పటి వరకు గిల్ ఆడిన 16 మ్యాచ్ లలో మూడు సెంచరీ ల సహాయంతో 851 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ లో ఏ బౌలర్ కూడా ఇతన్ని ఆపలేక చేతులెత్తేశారు. కానీ ఒక్క బౌలర్ మాత్రం ఇతనిని నిలువరించడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యాడని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ శుబ్ మాన్ గిల్ 47 బంతులు వేయగా 63 పరుగులు ఇచ్చుకుని మూడు సార్లు అవుట్ చేశాడు.

కాగా గిల్ పై చాహర్ కు ఉన్న ఈ రికార్డు ఈ రోజు మ్యాచ్ లో కనుక వర్క్ అవుట్ అయితే చెన్నై కు విజయం కంఫర్మ్. మరి దీపక్ చాహర్ గిల్ ను అవుట్ చేసి చెన్నై టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషిస్తాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version