మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టుల కి అప్లై చేసుకో వచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో మొత్తం 11 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఖాళీగా వున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అకౌంటింగ్/ఫైనాన్స్/కామర్స్ స్పెషలైజేషన్ లో డిగ్రీ, పీజీ చేసుండాలి. లేదంటే సీఏ/ఐసీఎస్ఏ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసుండాలి.
అలానే ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. అంతే కాక సంబంధత పని లో అనుభవం కూడా తప్పని సరిగా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు ఖచ్చితంగా 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలని అనుకునే వారి వయస్సు జనవరి 28, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంది.
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వాళ్ళకి నెలకు రూ.50,000ల వరకు జీతంగా ఇస్తారు. పూర్తి వివరాలని https://sportsauthorityofindia.nic.in/sai/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.